Wednesday, 11 June 2014

Gunna maamidi komma meeda video with telugu lyrics... Superb lyrics, great song on friendship.

Movie: Bala mithrulu
Year: 1972
Sung by: S. Janaki
Music director: Satyam
Lyrics by: Dr.C.Narayana Reddy

                                                             You can watch the video here..

 గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి 
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి 
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది 
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి..

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది 
అయిన ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది 
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది 
అయిన ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది 
పొద్దున చిలకను చుడండి ముదు ముద్దుగ ముచ్చటలాడండి 
పొద్దున చిలకను చుడండి ముదు ముద్దుగ ముచ్చటలాడండి  
చిగురులు ముట్టదు  చిన్నారి కోయిల చిలక ఊగధు కొమ్మ ఊయల ..... 

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి 
ఒక గూటిలోన రామచిలుకుంది ఒక గూటిలోన కోయిలుంది 
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి 
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి 
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
 రంగు రూపు వేరైన జాతి రీతి వేరైన   రంగు రూపు వేరైన తమ జాతి రీతి వేరైన
 చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు  తరగని కలిమి... 

 గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి 
ఒక గూటిలోన రామచిలుకుంది ఒక గూటిలోన కోయిలుంది 
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి...... 
 
Hope you enjoyed..

Monday, 9 June 2014

sriraama naamaalu shatakoti video with telugu lyrics...

Movie : Meena
Year : 1973
Sung by : Smt P.Susheela
Name: శ్రీరామ నామాలు శతకోటి ... 

                                                                  Listen and watch it here...

 శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి
 శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి  
శ్రీరామ నామాలు శతకోటి 

 తండ్రి యానతి తల దాల్చు తనయుడు దాశరధ రామయ్య తవనీయుడు
 తండ్రి యానతి తల దాల్చు తనయుడు దాశరధ రామయ్య తవనీయుడు 
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు  కళ్యాణ రామయ్య కమనీయుడు 

శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి 
శ్రీరామ నామాలు శతకోటి 

సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు 
కోతి మూకలతో ... ఆ.... 
 కోతి మూకలతో లంకపై దండెత్తు కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు.. 

శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి 
శ్రీరామ నామాలు శతకోటి 

పవమాన  సుతుడు పాదాలు పట్టగ పట్టాభిరామయ్య పరంధాముడు
పవమాన  సుతుడు పాదాలు పట్టగ పట్టాభిరామయ్య పరంధాముడు 
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుత రామయ్య అఖిలాత్ముడు అఖిలాథ్ముదు...

శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి 
శ్రీరామ నామాలు శతకోటి .. 

Hope u enjoyed the lyrics..

Amma donga ninnu chudakunte.. Every mother feel this during the wedding of her daughter...

అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ 
నా  కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ 
గల గల మని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ 
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
కథ చెప్పేదాకా కంట నిదుర రాక 
కథ చెప్పేదాకా  నీవు నిడురబోక 
కథ చెప్పేదాకా నన్ను కదలనీక 
మాట తోచనీక మూతి ముడిచి చూసేవు 
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
ఎపుడో ఒక అయ్యా నిన్నేగరేసుకు పొతే 
నిలువలేక నా  మనసు నీవైపే లాగితే
ఎపుడో ఒక అయ్యా నిన్నేగరేసుకు పొతే 
నిలువలేక నా  మనసు నీవైపే లాగితే 
గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురబోవున 
గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురబోవున 

అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు  రాలు 
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు  రాలు 
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు 
కలతలు కష్టాలు నీ దరికి రాక కల కాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలు కష్టాలు నీ దరికి రాక కల కాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి 
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ....  

Listen this song here...     Beautiful song in light music...