Monday, 9 June 2014

Amma donga ninnu chudakunte.. Every mother feel this during the wedding of her daughter...

అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ 
నా  కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ 
గల గల మని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ 
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
కథ చెప్పేదాకా కంట నిదుర రాక 
కథ చెప్పేదాకా  నీవు నిడురబోక 
కథ చెప్పేదాకా నన్ను కదలనీక 
మాట తోచనీక మూతి ముడిచి చూసేవు 
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
ఎపుడో ఒక అయ్యా నిన్నేగరేసుకు పొతే 
నిలువలేక నా  మనసు నీవైపే లాగితే
ఎపుడో ఒక అయ్యా నిన్నేగరేసుకు పొతే 
నిలువలేక నా  మనసు నీవైపే లాగితే 
గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురబోవున 
గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురబోవున 

అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు  రాలు 
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు  రాలు 
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు 
కలతలు కష్టాలు నీ దరికి రాక కల కాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలు కష్టాలు నీ దరికి రాక కల కాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి 
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ....  

Listen this song here...     Beautiful song in light music... 

                          



No comments:

Post a Comment